ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు సంయుక్త ర్యాలీ చేపట్టారు. క్యాన్సర్ పరీక్షలు పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు. పట్టణ పురవీధులలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.