ATP: కళాశాలల సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన ధర్నా నిర్వహించారు. కల్యాణదుర్గం పట్టణంలో రెవెన్యూ కాలనీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్, కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన రహదారిలో నూతనంగా మద్యం షాపు నిర్వహించడాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.