మహారాష్ట్రలో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ ఇవాళ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే అమ్మాయిలకు ఇస్తున్నట్లు అబ్బాయిలకూ ఉచిత విద్యను అందిస్తామని హామీనిచ్చింది. దీంతో పాటు ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేస్తామని ప్రకటించింది.