NRML: గ్రూప్-3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 17,18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.