MNCL: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ హైదారాబాద్ లో తలపెట్టిన మహా ధర్నాకు మందమర్రి పట్టణంలోని ఆటో యూనియన్ నాయకులు బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు ప్రతి నెల రూ.15 వేలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.