AP: MLC రఘురాజుకు హైకోర్టులో ఊరట లభించింది. తన MLC సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. ఎమ్మెల్సీ వాదన వినకుండా సభ్యత్వం రద్దు సరికాదని స్పష్టం చేసింది. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ప్రకటించింది. తన వాదన విన్న తర్వాత నిర్ణయం వెలువరించాలని మండలిని ఆదేశించింది. అప్పటిదాకా సభ్యత్వం పునరుద్ధరిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు రఘురాజు సభ్యత్వం రద్దు చేస్తూ మండలి ఛైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.