SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అర్బన్ హౌసింగ్ గ్రీవన్స్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించగా ప్రజల నుంచి వారి సమస్యల అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 12 అర్జీలు వచ్చాయని కమిషనర్ వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు.