అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం హోవర్డ్ యూనివర్సిటీ వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి కమలా హారిస్ ప్రసంగించారు. ‘ఇది ఆశించిన ఫలితం కాదు.. కానీ దీన్ని అంగీకరించాల్సిందే. ఓడిపోయినా.. పోరాటాన్ని మాత్రం ఆపను. ఎన్నికల్లో పోటీపడిన తీరుపై గర్వంగా ఉంది. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుంది. దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదే. ప్రజల స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం నా పోరాటం కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు.