VZM: పట్టణంలో వుడా కోలనీలో ఓ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో కేసు నమోదు చేశామని 1వ పట్టణ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. వుడా కోలనీలో నివాసం ఉంటున్న రామలక్ష్మి మెడలో సుమారు 4 తులాల బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి అపహారించాడన్నారు. ఆమె భర్త నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామన్నారు.