AKP: జీవీఎంసీ జోన్-7 అనకాపల్లి పరిధిలో తుంపాల పంప్ హౌస్ నుంచి అనకాపల్లిలో వివిధ ప్రాంతాలకు గురువారం తాగునీటికి అంతరాయం కలుగుతుందని నీటి సరఫరా విభాగం కార్య నిర్వహక ఇంజినీరు మురళీకృష్ణ బుధవారం తెలిపారు. పైపులైను లీక్ అయినందున మరమ్మతుల నిమిత్తం నీటి సరఫరా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం యధావిధిగా నీటి సరఫరా ఉంటుందన్నారు.