KMM: మధిర నియోజకవర్గంలో చింతకాని, బోనకల్ మండలాల్లో గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాగులవంచలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అనంతరం బోనకల్- ఆళ్ళపాడు రహదారి పనులను ప్రారంభిస్తారని చెప్పారు. డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.