KRNL: దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్క గ్రామాల్లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం తవ్వకాలు లేవని ఎస్పీ తెలిపారు. యురేనియం తవ్వకాల గురించి వదంతులు నమ్మొద్దని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.