NDL: ఈ నెల 9న సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన నేపథ్యంలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలను బుధవారం పరిశీలించారు. మండల తహశీల్దార్ శ్రీనివాసులు, సీఐ జీ.ప్రసాదరావు క్షేత్ర పరిధిలోని పలు ప్రదేశాలను పరిశీలించారు. జిల్లా అధికారుల ఆదేశాలతో ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీఆర్వో నాగచంద్రుడు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.