ప్రకాశం: సైబర్ నేరాల నివారణకు పోలీసులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ దామోదర్ కోరారు. మంగళవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఎస్పీ మాట్లాడుతూ.. నగదు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మెయిల్, వాట్సప్ ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ మోసాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.