ATP: దీపం-2 పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో దీపం-2 పథకాన్ని అమలుపై డీఎస్బీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పారదర్శకంగా అందజేయాలని సూచించారు.