TG: రాష్ట్రంలో ధాన్యం సేకరణ విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్న ధాన్యంపై క్వింటాకు రూ.500 బోనస్ అందించడం చారిత్రక నిర్ణయమన్నారు. 2025 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తామన్నారు. ఇది దేశ చరిత్రలో మరో మైలురాయి అని, ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.