గుజరాత్లో నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లా వసాద్ దగ్గర పిల్లర్లు కుప్పకూలడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.