PLD: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పిన్నెల్లి విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు పిన్నెల్లి పిటిషన్ మంగళవారం పరిశీలించి విదేశాలు వెళ్లేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.