ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ IPOకు రానుంది. సబ్స్క్రిప్షన్ రేపటి నుంచి ప్రారంభమై ఈ నెల 8న ముగియనుంది. 11న షేర్ల కేటాయింపు.. 13న లిస్టింగ్ అవనుంది. ధరల శ్రేణిని రూ.371 నుంచి రూ.390 మధ్య కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాట్లో 38 షేర్లు ఉండగా, ఒక లాట్‌పై ఇన్వెస్టర్లు రూ.14,820 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ IPO ద్వారా రూ.11,326 కోట్లు సమీకరించాలని స్విగ్గీ లక్ష్యంగా పెట్టుకుంది.