NLR: వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం సముద్ర తీరం వద్ద కలెక్టర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన దళం ఆధ్వర్యంలో తుఫాన్ విపత్తులపై మాక్ డ్రిల్ మంగళవారం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలు తుఫాన్ సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రమాద పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో చేసి చూపించారు.