ప్రకాశం: ప్రాథమిక విద్యకు గొడ్డలిపెట్టుగా ఉన్న జీవో 117ను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలకు పూర్వ వైభవం తేవాలని ఏపీటీయఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల డిమాండ్ చేశారు. మంగళవారం మార్కాపురం డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల ప్రసంగిస్తూ.. ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.