TG: BJP ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ గతంలో చేసిన ఆరోపణలపై AICC వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు పిటిషన్పై విచారణ వాయిదా పడింది. డిసెంబర్ 5కు నాంపల్లో కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరగిన విచారణకు దీపాదాస్ మున్షీతోపాటు NVSS ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కేసులో ప్రభాకర్ పలుసార్లు కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇవాళ ఆయన హాజరయ్యారు.