TG: హుజూర్నగర్, కోదాడలో అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వర్షాకాలంలో 150 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. ఎక్కడా లేని విధంగా కులగణన జరుగుతోందన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షల ఆరోపణలు పసలేనివని పేర్కొన్నారు. కోదాడ, హుజూర్నగర్లో అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పనుల్లో జాప్యం తగదని.. అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.