CTR: పుంగనూరు పట్టణంలో సోమవారం వారపు సంత సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు 10 రూపాయల కాయిన్స్ చెలామణి కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్బీఐ అధికారులు పది రూపాయల కాయిన్స్ చెలామణిలో ఉన్నాయని ప్రకటించినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు ₹10 కాయిన్స్ తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.