కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి ఉజ్జల్ దోసంజ్ అన్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని ట్రూడో తీరుపై ఆయన మండిపడ్డారు. సామాజికంగా, రాజకీయంగా ప్రధాని ఒక ఇడియట్ అని ఘాటు విమర్శలు చేశారు. కెనడా విలువల కంటే గుర్తింపు రాజకీయాలకే ట్రూడో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో ట్రూడోతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.