NLG: ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్లో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే అతి ముఖ్యమైందని అన్నారు.