AKP : అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించ వలసిందిగా సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. వివిధ సమస్యల మీద ప్రజలు 30 దరఖాస్తులను అందజేశారు.