E.G: నిత్యవసర ధరలు పెరగకుండా ముందుగానే ప్రభుత్వం అవసరమైన నిధిని కేటాయించి నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రిలోని సీపీఐ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిత్యవసర ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.