HYD: జిల్లాలో 2024 ఫిబ్రవరి 8 నాటి ఓటరు జాబితాతో పోలిస్తే ఇటీవల విడుదలైన ఓటర్ జాబితాలో ఏకంగా 1.3 లక్షల ఓటర్ కార్డులు రద్దు అయ్యాయి. ఒక్కొక్కరికి 2 గుర్తింపు కార్డులు ఉండడం, చనిపోవడం, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం, దొంగ పత్రాలతో పొందటం లాంటి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా 1,81,879 మంది ఓటర్లు చేరగా, 1,29,884 ఓటర్ కార్డులు రద్దయ్యాయి.