KDP: రహదారులపైన చెత్త పోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి హెచ్చరించారు. మడకలవారి పల్లి హరిజనవాడలో ఆయన సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా పలు దుకాణాల వద్ద చెత్త రహదారులపై పోసి ఉండటానికి గుర్తించారు. చెత్తను సంబంధిత యజమానుల చేతనే తొలగించారు. మున్సిపాలిటీ పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.