SKLM: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ అని ఎమ్మెల్యే అన్నారు. రణస్థలం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సోమవారం MLA ఈశ్వరరావు ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు “ప్రజా దర్బార్ ” నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. MLA ప్రజలు నుంచి ఆర్జీలు స్వీకరించి తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామన్నారు.