తన పుట్టినరోజు సందర్భంగా ధూమపానం మానేసినట్లు బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. శనివారం తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకప్పుడు రోజుకు 100 సిగరెట్లు తాగేవాడినని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.