అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆలయానికి వెళ్లే సమయంలో ఏదైనా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5 లక్షల ఉచిత బీమాను వర్తింపజేయనున్నారు. సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన మకరవిళక్కు సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళలోని దేవాలయాలను నిర్వహించే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ ఈ స్పెషల్ బీమా కవరేజీ పథకానికి బీమా ప్రీమియం చెల్లించనుంది.