SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 21వ వార్డు డ్రైనేజీలో పూడికల తొలగింపు పనులను శనివారం చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థ పూడిక పోవడంతో మురికి నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఏర్పడింది. స్థానికులు సమస్యపై మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు పూడికల తొలగింపు పనులను చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులలు తెలిపారు.