TG: ఓటీఎస్ గడువును జలమండలి పొడిగించింది. నవంబర్ 30 వరకు ఓటీఎస్ గడువు పెంచినట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. వినియోగదారుల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా అక్టోబర్ 31 వరకు రూ. 49 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఓటీఎస్‌ను 70,335 మంది వినియోగించుకున్నారన్నారు.