AP: రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం రూ. 210 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర, జిల్లా రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఆర్అండ్బీ శాఖ నిధులు మంజూరు చేసింది. అదేవిధంగా రోడ్ల పక్కనున్న పిచ్చిమొక్కలు కూడా తొలగించాలని సూచించింది. అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా పనులు చేపట్టాలని ఆదేశించి. గత ప్రభుత్వ హయాంలో గుంతల రోడ్లతో విసిగిపోయిన ప్రజలకు కొంత మేరకు ఉపశమనం కలగనుంది.