W.G: నరసాపురం పురపాలక సంఘం ప్రధాన రక్షిత మంచినీటి సరఫరా విభాగంలోని క్లీనింగ్ పనులు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య తెలిపారు. ఈ పనుల కారణంగా ఈనెల 4వ తేదీ సోమవారం సాయంత్రం నీటి సరఫరా ఉండదని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.