NLR: ఆత్మకూరు పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్‌ను ఆకస్మిక ఆత్మకూరు ఆర్డీవో బి.పావని తనిఖీ చేశారు. హాస్టల్లోని అన్ని విభాగాలను ఆర్డీవో పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న ఆహార మెనూను పరిశీలించి వంట తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో హాస్టల్లో పొందుతున్న వసతుల గురించి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.