న్యూయార్క్‌లోని విట్ బై హోటల్లో పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు. బ్లూప్రింట్తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా అనుమతులు ఇచ్చేందుకు ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సిద్దంగా ఉందన్నారు. ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవవనరులను సిద్ధం చేసేందుకు స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమన్నారు.