ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామ పంచాయతీలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం స్థలాన్ని శనివారం చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మండలంలోని రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉండేందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేశారు.