మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ చేస్తున్నాడు. ఇటీవల ప్రభాస్ స్టిల్ బయటకు రాగా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. ఎల్లో, బ్లూ కలర్ కాంబినేషన్ చెక్ షర్టులో అదరగొట్టాడు. ఇదే షర్ట్ ఇటీవల ‘విశ్వం’లో హీరో గోపీచంద్ వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలకు ఒకరే నిర్మాత (TG విశ్వప్రసాద్) కావడంతో బడ్జెట్ తగ్గించుకోవడానికి ఇద్దరు హీరోలకు ఒకే షర్టు వాడారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.