KDP: కడప తాలూకా, సైబర్ క్రైమ్ సెల్, సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్.పి వి. హర్షవర్ధన్ రాజు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో మాట్లాడి వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. సి. సి. టి. ఎన్. ఎస్, కోర్ట్ కానిస్టేబుళ్లతో మాట్లాడి వారి వృత్తి పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.