TG: కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు 10 వేల రోజులు కూడా సరిపోవని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై మోదీ చేసిన విమర్శలకు ఎక్స్‌లో రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దీనిపై బండి సంజయ్ స్పందించారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని, రైతు భరోసా, రూ.500 పంట బోనస్ బోగస్ అయ్యాయని విమర్శలు చేశారు. రూ.500 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌లో అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారన్నారు.