మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉండటంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అహల్యనగర్ జిల్లాలోని టోల్‌ప్లాజా వద్ద తనిఖీలలో ఓ కారులో విలువైన ఆభరణాలు గుర్తించారు. కారులో లభ్యమైన వజ్రాలు, బంగారం, వెండి నగల విలువ దాదాపు రూ.24 కోట్లు అని అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులు ఆభరణాల విలువకు సరిపోకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణను ఐటీ శాఖకు బదిలీ చేశారు.