TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అమీన్పూర్ బాధితుల ఫిర్యాదు చేశారు. సర్వే నం.6 అనుమతులు చూపించి సర్వే నెం.12కు చెందిన ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మారంటూ వాపోయారు. తమను మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటేశ్వరరావు అనే వ్యక్తులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వేడుకున్నారు.న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.