KDP: చిట్వేల్ మండల పరిధిలోని కేఎస్ఏ అగ్రహారం గ్రామానికి చెందిన చెక్కిపత్తు లక్ష్మి అనే బాధితురాలికి శుక్రవారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ రూపానందరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రమాద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను వినియోగించుకోవాలని సూచించారు.