PPM: బలిజిపేట మండలంలో పలగర గ్రామంలో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లు మహిళలకు శుక్రవారం అందజేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు కావస్తుందని, ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం మొదటి సంతకం డీఎస్సీ పైన, రెండవ సంతకం పెన్షన్ 4,000 రూపాయలు పైన చేసిందని తెలిపారు.