TG: సీఎం రేవంత్ రెడ్డికి పలువురు కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, సంజయ్ ఇతర నేతలు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు.