AP: భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగిన ఘటన కడప జిల్లాలోని వేంపల్లిలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం గురు, అంకాలమ్మ ప్రేమవివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన తరువాత అంకాలమ్మను గురు విడిచిపెట్టడంతో తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు కూర్చోని ధర్నాకు దిగింది. దీంతో గురు బంధువులు సదరు యువతిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.