TG: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీరు ఆకాశంపై ఉమ్మేసినట్లు ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్‌పై ఆరోపణలు చేయడం కాదని.. దమ్ముంటే కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని సవాల్ విసిరారు. పదేళ్లు స్కాంలకు పాల్పడిన BRS ప్రభుత్వంపై కేంద్రంలో ఉన్న బీజేపీ విచారణ జరపలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ BJP అధ్యక్ష పదవి కావాలంటే నాగ్‌పూర్ వెళ్లి RSS పెద్దలదగ్గర పైరవీలు చేసుకోండని సూచించారు.